చిన్న తరహా పరిశ్రమల కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు : మునియప్ప
కదిరి: పన్నెండో పంచవర్ష ప్రణాళికలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం రూ. 24 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి మునియప్ప తెలియజేశారు. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ రోజు ఆయన సందర్శంచారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలియజేశారు.