చిరంజీవి ప్రకటన వాస్తవమే: టీజీ

కర్నూల్‌ : పీఆర్పీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఉందని మంత్రి టీజీ వేంకటేష్‌ అన్నారు. ఈ అంశం చిరంజీవి ఇచ్చిన ప్రకటనలో వాస్తవం ఉందని అన్నారు. త్వరలో మంత్రి వర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కలవనున్నట్లు ఆయన వెల్లడించారు.