చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడి, ముగ్గురి అరెస్టు

నెల్లూరు: ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని తడ మండలం భీమునివారిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో తెల్లవారుజామున నుంచి ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 56,795 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు  చేసి దర్యాప్తు చేపడతామని ఏసీబీ అధికారులు తెలియజేశారు.