చెవి కమ్మల కోసం చిన్నారి హత్య

హైదరాబాద్‌ :  చెవి కమ్మల కోసం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. రమ్యశ్రీ అనే నాలుగేళ్ల బాలికను అపహరించిన పక్కింటి మహిళ  ఆ బాలికను గొంతు నులిమి చంపి పాతబస్తీలోని తలాబ్‌ కట్టలో పడవేసింది. నిందితురాలిని లక్ష్మిగా గుర్తించిన పోలీసులు ఈ మేరకు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.