చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.1కోటి 6 లక్షలతో అభివృద్ధి పనులు… ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో మార్కెట్ అభివృద్ధికి కృషి.. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మద్దెల శివనీలచింటు..
చేవెళ్ల ఆగస్టు 24 (జనంసాక్షి) చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిలో తమవంతు సహకారం అందిస్తున్నట్లు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మద్దెల శివనీలచింటు అన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.1కోటి 6 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు, మార్కెట్ షెడ్ మరమ్మతులు, టాయిలెట్స్ మరమ్మతులు , 6 దుకాణాల టెండర్ల పనులను బుధవారం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గౌండ్ల యాదయ్య, అబ్దుల్ గని, విశ్వనాథంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…చేవెళ్ల మార్కెట్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. చేవెళ్ల మార్కెట్ యార్డులో రూ. 1కోటి 6 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రూ. 70 లక్షలతో సీసీ రోడ్డు, మార్కెట్ షెడ్ మరమ్మతులు, టాయిలెట్స్ మరమ్మతులు, కొత్త 6 దుకాణాల నిర్మాణం కోసం రూ.36 లక్షలు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తొందరలో పనులు చేపడుతామని తెలిపారు. మార్కెట్ యార్డను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచేందుకు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. గతేడాది పత్తి కొనుగోలు, వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగిందన్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో మార్కెట్ యార్డును అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రైతులు మద్దతు తెలుపుతున్నారని, రైతు బాంధవుడుగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోతారని అన్నారు. తెలంగాణలో ఉన్న రైతులకు సీఎం కేసీఆర్ ఉన్నారనే ధైర్యంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలను తోలగించే విధంగా రైతులకు ఉచితంగా 24గంటల కరెంట్, రైతు బీమా, రైతు బంధు, సకాలంలో ఎరువుల పంపిణి చేసి ప్రభుత్వం భరోసా కల్పిస్తూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.