జంబిగి కె గ్రామాలలో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం

 రాయికోడ్ జనం సాక్షి  సెప్టెంబర్ 03 మండల పరిధిలోని ఆయా గ్రామాలలో నిర్వాహకులు ఏర్పాటుచేసిన వినాయక మండపాలలో గణనాథుడు వివిధ రకాల ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. మండలంలోని జంబిగి కె గ్రామంలో నీ శ్రీ పాండురంగ విట్టరేశ్వర ఆలయ అవరణలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో గ్రామానికి చెందిన ఓగ్గు విట్టల్  కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి అంతా మండపం వద్ద భక్తులు భజన కీర్తనలు నిర్వహించి రాత్రంతా జాగరణ చేశారు. ఉదయం విఘ్నేశ్వరునికి మరియు పాండురంగ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి శ్రీకాంత్, మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి. మాజీ సర్పంచులు వెంకటరెడ్డి టి శ్రీశైలం గ్రామ పెద్దలు పి వెంకట రాములు పాటిల్ రత్నారెడ్డి భజన మండలి సభ్యులు వీరారెడ్డి మల్లారెడ్డి పి శంకరయ్య అమీర్ ఖాన్ శాంతయ్య స్వామి నీలకంఠయ్య స్వామి గోపాల్ మల్గొండ లక్ష్మయ్య సిద్ధన్న వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మల్లేశం శ్రీశైలం కె విష్ణు శశి కుమార్ మీ కాశీనాథ్ సంతోష్ దశరథ గురువీర్ బిట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు