జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితులను నేడు ప్రశ్నించనున్న ఈడీ

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న పలువురి నిందితులను ఈడీ ప్రశ్నించనుంది.చంచల్‌గూడ జైల్లో నిమ్మగడ్డప్రసాద్‌,బ్రహ్మనందరెడ్డి,బీపీ ఆచార్యాలను ఈడీ అధికారులు విచారించనున్నరు.విచారణ కోసం సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందిన ఈడీ ఇప్పటికే నిందితులకు సమన్లు జారీ చేసింది.నిన్న ఓఎంపీ కేసు నిందితులను చంచల్‌గూడ జైల్లో ఈడీ ప్రశ్నించింది.