జగన్‌ బెయిల్‌ కేసు మరోసారి వాయిదా

హైదరాబాద్‌: చట్టబద్ధంగా తమ బెయిలుకు అర్హుడినంటూ అక్రమాస్తుల కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు మరికొంత గడువు కావాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ జగన్‌ వేర్వేరుగా  దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ తుది విచారణ జరగాల్సి వుంది. అయితే రెండు పిటిషన్లలోనూ వేర్వేరుగానే వాదనలు వినిపిస్తామని జగన్‌ తరపున న్యాయవాదులు అభ్యర్థించడంతో సీబీఐ కూడా వేర్వేరు కౌంటర్లు దాఖలు చేసింది. అయితే స్టాట్యుటరీ బెయిల్‌ పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని సీబీఐ అభ్యర్థించడంతో హైకోర్టు న్యాయమూరి& జస్టిన్‌ బి. శేషశయనారెడ్డి విచారణను 19కి వాయిదా వేశారు. మరోవైపు ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో ప్రధాన  నిందితుడు, ఓఎంసీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి తన బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.