జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కడప ఎంపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు హైకోర్టులో మరోసారి భంగపాటు తప్పలేదు. జగన్‌ వేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ ఆ పిటిషన్‌ విచారణార్హం కాదంటూ తిరస్కరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల కాలపరిమితి విధించాలన్న జగన్‌ తరపున్యాయవాదుల విజ్ఞప్తి కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకే నివేదించి ఉండాల్సిందని అభిప్రాయడింది.