జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళులు

హైదరాబాద్‌: బాబూ జగ్జీవన్‌రామ్‌ 26వ వర్థంతిని పురస్కరించుకుని దళిత సంఘాలు హైదరాబాద్‌లో ఘనంగా నివాళులర్పించాయి. బషీర్‌బాగ్‌లోని ఆయన విగ్రహానికి సికింద్రాబాద్‌ ఎంపీ అంజయ్‌కుమార్‌ యాదవ్‌, నగర డిప్యూటి మేయర్‌లతో పాటు పలు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను అంజయ్‌కుమార్‌ కొనియాడారు.