జగ్జీవన్ రాం కు సీఎం కేసీఆర్ నివాళి
హైదరాబాద్ : రాష్ర్టంలో బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని జగ్జీవన్ రాం విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తదితర నేతలు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.