జనవరి 1న ఆర్‌బీఐ ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్‌: భారతీయ రిజర్వ్‌ బ్యాంకు కార్యాలయాల్లో చిల్లర నాణేలు, పాత కరెన్సీ నోట్ల మార్పిడి కేంద్రాల మూసివేతను నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. జనవరి ఒకటిన దేశావ్యాప్తంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంకు అధికారులు. ఉద్యోగులు, కార్మికులంఆ కలిసి ఒకరోజు సమ్మెలో పాల్గోనేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్‌బీఐ చట్టం 1934 ప్రకారం ప్రజలకు చిల్లర చిరిగిన నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కార్మిక, ఉద్యోగ సంఘాలను సంప్రదించకుండానే యజమాన్యం ఏకపకంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక చర్యల వల్ల మార్కెట్‌లో ద్రవ్య చెలామణికి ఇబ్బంది కలుగునుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యతో మధ్య చిన్న తరహా వ్యాపారసులే తావ్రంగా నష్టపోనున్నారని ఆర్‌బీఐ ఉద్యగ, కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.