జనాభా నియంత్రణపై అవగాహన అవసరం

ఆదిలాబాద్‌, జూలై 10 : జనాభా పెరుగదలను నియంత్రించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా వైద్య అధికారి మణిక్‌రావు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా జనాభ 27, 37,738 ఉందని ఆయన పేర్కొన్నారు. జనాభ పెరగడానికి గ్రామీణ ప్రజల్లో అగాహన లేకపోవడం, పురుషులు వేసక్టమి శస్త్ర చికిత్స చేయించడానికి ముందుకు రాకపోవడం ప్రధాన కారణాలని అన్నారు. జనాభను నియంత్రించేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. జనాభా నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 11 న ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్‌లో ర్యాలీ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనాభా నియంత్రణపై విద్యార్థులకు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.