జర్నలిస్టు సంక్షమానికి కృషి చేస్తా : డీకే అరుణ

హైదరాబాద్‌: జర్నలిస్టుల సంక్షేమానికి తన సహాయ సహకారాలు ఎపుడూ ఉంటాయని రాష్ట్ర సమాచార మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ సంఘం డైరీని ఆమె ఆవిష్కరించారు. జర్నలిస్టుల మెడిక్లెయమ్‌ ఫండ్‌కు ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో ఆలస్యం కారణంగా కొంతందికి ఇబ్బంది కలిగిన విషయాన్ని జర్నలిస్టు సంఘాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. మెడిక్లెయిమ్‌ మంజూరు ఆలస్యం వల్ల ఎవరైనా ఇబ్బంది పడినట్లైతే వారికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి సహాయం చేయడానికి చొరవ తీసుకుంటానని మంత్రి వెల్లడించారు. ప్రెస్‌ క్లబ్‌లో హెచ్‌యూజే డైరీ ఆవిష్కరణతోపాటు ఏపీయూడబ్య్లూజే అధ్వర్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల జర్నలీస్టుల ప్రాంతీయ సమావేశం జరిగింది.