జలమార్గం ద్వారానే ఉగ్రవాదుల చొరబాటు

సోషల్‌ మీడియాతో కొత్త సవాళ్లు
మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు
సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న ప్రధాని

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8 (ఆర్‌ఎన్‌ఏ):
దేశ భద్రతకు సోషల్‌ విూడియా కొత్త సవాలుగా మారిందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సింగ్‌ అన్నారు. దాన్ని నియంత్రించేందుకు, దుర్విని యోగం కాకుండా చూసేందుకు ఓ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. సరిహద్దు నియంత్రణ రేఖల వద్ద చొరబాట్లు పెరుగుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దులోని అంతర్జాతీయ సరిహద్దు తో పాటు లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ విూదుగా చొరబాట్లు పెరిగాయన్నారు. ఉగ్రవాదులు దేశంలో చొరబడేందుకు సముద్ర మార్గాలను ఎంచుకునే ప్రమాదం ఉందని ఉందని చెప్పారు. కొత్త పుం తలు తొక్కుతున్న సైబర్‌ నేరాలు ప్రమాద కరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. శనివారం రాష్టాల్ర డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఎస్‌ఎంఎస్‌, సోషల్‌ విూడియా దష్పచ్రారాలు కొత్త సవాలుగా మారాయని అన్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ‘సోషల్‌ విూడియా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా దుష్పచ్రారం చేస్తూ.. ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. సోషల్‌ విూడియా హక్కులను కాపాడుతూనే వాటిని జాగ్రత్తగా నియంత్రించాలి. ఇందుకు అవస రమైన సాంకేతిక విజ్ఞానాన్ని రూపొం దిస్తున్నాం’ అని అన్నారు. సైబర్‌ భద్రతకు పొంచి ఉన్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అంతర్గత భద్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాలు విస్తరించడం దేశాభివృద్ధికి
అవరోధమన్నారు. అసోం అల్లర్లపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో కొన్ని నెలలుగా మత ఘర్షణలు పెరిగియాన్నారు. వీటి వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుందదని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిఘా వర్గాలు బాగా పని చేస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు. వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడంతో పాటు శాంతిభద్రతలపై దృష్టి సారించాలని సూచించారు.జమ్మూకాశ్మీర్‌ సహా ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులను నియంత్రించడంలో నిఘా వర్గాలు, పోలీసులు విజయవంతమయ్యారని ప్రధాని ప్రశంసించారు. అమర్‌నాథ్‌ యాత్ర సందర్భంగా ఎలాంటి ఘటనలకు తావు లేకుండా భద్రతాచర్యలు చేపట్టారని కొనియాడారు. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం వల్ల అమర్‌నాథ్‌ యాత్ర విజయవంతమైందని, రికార్డు స్థాయిలో పర్యాటకులు జమ్మూలో పర్యటించారని అన్నారు. అయితే, ఉగ్రవాదుల నుంచి ముప్పు తొలగిపోలేదని, వారు తరచూ సవాళ్లు విసురుతున్నారని ప్రధాని చెప్పారు. గతేడాది ముంబై, ఢిల్లీలలో పేలుళ్లకు పాల్పడ్డారని, ఈ ఏడాది పుణెలో దాడి చేశారని గుర్తు చేశారు. 19 మంది ఉగ్రవాద మాడ్యుల్స్‌ను నిర్వీర్యం చేశామని చెప్పిన ప్రధాని.. ఉగ్రవాదుల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు మరింత సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, వృద్ధులపై నేరాల సంఖ్య పెరుగుతోందని మన్మోహన్‌సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఇది తీవ్రంగా ఉందన్నారు. వాటిపై పోలీసులు దృష్టి సారించి వ్యవస్థీకృత నేరాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.