జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా (ఐ జె యు )రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక..
-రాష్ట్రస్థాయిలో పలు జర్నలిస్టుల హర్షం వ్యక్తం..
–జర్నలిస్టుల నోటిలో నాలిక నల్లాల బుచ్చిరెడ్డి…
–జర్నలిస్టుల సమస్యల పరిష్కారంకు ‘ కేరాఫ్ బుచ్చిరెడ్డి అన్న….
హనుమకొండ బ్యూరో చీఫ్ 27 సెప్టెంబర్ జనంసాక్షి
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మంది జర్నలిస్టులు గుర్తుంచుకునే పేరు నల్లల బుచ్చిరెడ్డి అన్న… ఎన్నో పదవులు స్వీకరించి జర్నలిస్టు గుండెల్లో ముద్రగా మారిన నల్లల బుచ్చిరెడ్డి రెండోసారి జాతీయ కౌన్సిల్ మెంబర్గా ఏకగ్రీవం కావడం పట్ల.. మండల స్థాయి నుంచి.. జిల్లా స్థాయి నుంచి.. రాష్ట్ర స్థాయి వరకు పలు జర్నలిస్టులు.. హర్షం వ్యక్తం చేస్తున్నారు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుండే యోధుడు నల్లాల బుచ్చిరెడ్డి అన్న.. విలేకరులలో చిన్న పెద్ద తేడా లేకుండా అక్కున చేర్చుకునే మనసున్న మహానుభావుడని కొనియాడారు, రానున్న రోజుల్లో గొప్ప గొప్ప పదవులు అలంకరించాలని ప్రతి ఒక్క విలేఖరి కోరుకున్నట్లు తెలిపారు.