జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష

CM-KCR-IN-CII-INTERACTION

రాష్ట్రంలో ఎండల తీవ్రత, తాగునీటి ఎద్దడి వంటి ప్రధానమైన అంశాలపై సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వేసవి తీవ్రతపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశం ఎజెండాలో మొత్తం ఏడు అంశాలను పొందుపర్చారు. వీటిలో వడగాలులు, వాతావరణ మార్పులు, వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, తాగునీటి సరఫరా, హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పశు సంవర్ధకశాఖకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. పత్తికి ప్రత్యామ్నాయ పంటలపై కూడా చర్చించనున్నారు. అన్ని అంశాలపై చర్చించిన అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు.