జీడిమెట్లలో యువతిపై అత్యాచారం

హైదరాబాద్‌ : నగరంలో ఓ యువతి దారుణ మానభంగానికి గురైంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలోని శ్రీరాంనగర్‌లో నిన్న అర్ధరాత్రి ఓ ఇరవై ఏళ్ల యువతిపై ముఖ్తర్‌ అనే రౌడీ షీటర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి గురైన యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తాజావార్తలు