జీమెయిల్‌ సర్వీసులను బ్లాక్‌ చేసిన ఇరాన్‌

టెహ్రాన్‌: అమెరికాలో తయారైన ఇస్లాం వ్యతిరేఖ చిత్రం పట్ల నిరసనగా ఇరాన్‌లో ఈ రోజునుంచి జీమెయిల్‌ సర్వీసులను బ్లాక్‌ చేసింది. ఆస్కార్‌ నిర్వాహకులు కూడా యాంటి ఇస్లామిక్‌ చిత్రాన్ని ఖండించకపోతే ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆదివారం అర్థరాత్రి నుంచి జీమెయిల్‌ సర్వీసులను నిలిపివేసినట్లు స్థానిక న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.