జెండాల తండాలో ఘనంగా బోనాలు
జెండాల తండాలో ఘనంగా బోనాలు
టేకులపల్లి,మార్చి 31 (జనం సాక్షి ): మండలంలోని జండాలతండా చింతలంకతండా లో నూతనంగా ప్రతిష్ట చేసిన బొడ్డురాయి ముత్యాలమ్మ గుడికి మహిళలు, యువతులు శుక్రవారం బోనాలు ఎత్తుకొని భారీ ఊరేగింపుతో ఘనంగా సమర్పించారు. ఈ బోనాల కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ బిందు పల్లవి,గిరిజన ఉద్యోగుల సంగం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ హతీరామ్ నాయక్, కాంగ్రెస్ జిల్లా నాయకులు, బేతంపూడి సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్రావు, గ్రామ పెద్దలు దళ్ సింగ్ నాయక్, లాలు నాయక్, భోజ్య నాయక్, తేజ్య నాయక్,కిషన్ నాయక్,సక్రం నాయక్, రంగ్య, రమేష్, చినేష్, రాంబాబు, మధు, ప్రవీణ్, నవీన్, సురేష్, నరేష్, శోభన్,యువకులు,మహిళలు, ఆడ పడుచులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా పండుగ వాతావరణం గా జరుపుకున్నారు.