జేపీ దీక్షకు నేతల సంఘీభావం
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన సురాజ్య ఉద్యమం, జన చైతన్య దీక్ష మూడో రోజుకు చేరింది. పార్టీలకతీతంగా నేతలు జేపీ దీక్షకు సంఘీభావం తెలిపారు. పీసీసీ అధినేత బొత్స, భాజపా నేత బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ చూక్కారామయ్య, సినీ దర్మకుడు రాజమౌళి తదితరులు దీక్ష స్థలికి వచ్చి జేపీకి మద్దతు తెలిపారు. కాలానుగుణంగా చట్టాల్లో మార్పు తేవాలని బొత్స ఈ సందర్భంగా అన్నారు.