జైలుకెళ్లినా ఫర్వాలేదు… తొలిషాపును కాల్చిపడేస్తా :ఉమాభారతి

ఢిల్లీ: తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని, ఎఫ్‌డీఐ కింద ప్రారంభమయ్యే తొలి మల్టిబ్రాండ్‌ షాపును తగలబెట్టేస్తానని బీజేపీ సీనియర్‌ నేత ఉమాభారతి పేర్కొన్నారు. భారత్‌ అభివృద్ధి చెందుతుందని, సత్వర అభివృద్ధికి తోడ్పాటు అవసరమే కానీ ఆది ఎఫ్‌డీఐల రూపంలో కాదని ఉమాభారతి అభిప్రాయపడ్డారు.