జైళ్ల శాఖతో హిమాలయ సంస్థ ఒప్పందం

హైదరాబాద్‌: జైళ్లలో ఔషధ మొక్కల పెంపకం, వనమూలికల తయారీపై ప్రముఖ ఆయుర్వేద సంస్థ హిమాలయ జైళ్లశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ జైళ్లు,  సంస్కరణల సేవల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ టిపి దాన్‌, హిమాలయ డ్రగ్‌ కంపెనీ ఆగ్రో టెక్‌ అండ్‌ ఫైటో కెమిస్ట్రీ హెడ్‌ బాబు ఒప్పంద పత్రాలపై  మంగళవారం సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, ఔషధ మొక్కలను సాగు చేయడంలో ఖైదీలకు హిమాలయ సంస్థ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ అనంతరం తొలి దశలో అనంతపురనంలోని ప్రిజనర్స్‌ అగ్రికల్చరల్‌ కాలనీలోని ప్రిజన్‌ ఫామ్‌లో ఔషధ మొక్కలు సాగు చేయనున్నారు.