టీడీపీవి పొంతలేని మాటలు : రాఘవులు
హైదరాబాద్: తెలంగాణ విషయంలో టీడీపీ పొంతన లేని మాటలు మాట్లాడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు.అఖిలపక్షంలో చంద్రబాబు ఇచ్చిన టీడీపీ లేఖకు, లోపల, బయట ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలకు పొంతన లేదని ఆయన పేర్కొన్నారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడి, బాబు లేఖలో మాత్రం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. వైఎస్సార్ సీపీ సమావేశంలోనూ. బయట అస్పష్టంగానే చెప్పిందన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబించిందని తెలియజేశారు.