టీ20 ప్రపంచకప్ టీమిండియాదే..
` ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపు
` రాణించిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ,అభిషేక్ శర్మ
` మూడోసారి పొట్టికప్ దక్కించుకున్న భారత్
డిఫెండింగ్ ఛాంపియన్ టీమఇండియా టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దీంతో మూడోసారి ట్రోఫీని దక్కించుకొని టీమఇండియా చరిత్ర సష్టించింది. మరే జట్టు కూడా మూడు టైటిళ్లను గెలుచుకోలేదు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాత భారత్‌కు కప్ అందించిన సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఆతిథ్య జట్టు స్వదేశంలో ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు శాంసన్ (89), ఇషాన్ కిషన్ (54), అభిషేక్ శర్మ (52) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. టిమ్ సీఫెర్ట్ (52) టాప్ స్కోరర్. మిచెల్ శాంట్నర్ (43) రాణించాడు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత బౌలర్లు సమష్టిగా రాణించి కివీస్‌ను కట్టడి చేశారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 4, అక్షర్ పటేల్ 3.. హార్దిక్ పాండ్య, వరుణ్, అభిషేక్ తలో వికెట్ తీశారు.
ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణం
` టీమ్ ఇండియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు
టీ 20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి.. వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హదయపూర్వక అభినందనలు తెలిపారు. అహ్మదాబాద్‌లో భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించింది. ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణమని సీఎం అన్నారు.మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు భారత జట్టు సమన్వయంతో, ధైర్యసాహసాలతో ఆడుతూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిందని ప్రశంసించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు.టీమ్? ఇండియా సాధించిన విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని అన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు టీమ్ సభ్యులందరికీ ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.



