టూరిజం క్యాలెండర్ విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలోని యాత్రా విశేషాలతో రూపొందించిన క్యాలెండర్‌ను పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ వేడుకల సందర్భంగా ఈ క్యాలెండర్‌ను విడుదల చేశారు చారిత్రక ప్రాంతాలను సందర్శించేవారికి రాష్ట్రంలోని వివిధ పర్యాటక స్థలాలపై అవగాహన కలిగే విధంగా ఈ క్యాలెండర్ రూపొందించినట్లు మంత్రి తెలియజేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వట్టి వసంతకుమార్‌తో పాటు సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్, కమిషనర్ చందనాఖన్, సలహాదారుడు కేవీ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.