టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద 144 పెక్షన్
చిత్తూరు,మార్చి25 : జిల్లాలో నేటినుంచి జరుగనున్న పదోతరగతి పరీక్షలకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రులు గాని, ఇతరులు గాని ఉంటే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే పరీక్ష కేంద్రాలలోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.