టేకు కలప పట్టివేత

కాటారం : కాటారం మండలం ప్రతాప్‌గిరి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి టేకు కలప అక్రమంగా తరలిస్తుండగా మహదేవపూర్‌ ఏసీఎఫ్‌ ప్రకాష్‌ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. మహదేవపూర్‌ మండలం సరవాయి పేట గ్రామం నుంచి ఎద్దుల బండ్ల ద్వారా పట్టణ ప్రాంతానికి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఆదివారం సుమారు రూ. 1.50 లక్షలు విలువచేసే కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పట్లుకున్న కలపను మహదేవపూర్‌ ప్రభుత్వ కలప డిపోకు తరలించినట్లు ఆయన తెలిపారు.