-->

ట్రాస్స్‌కో అధికారులను ఘెరావ్‌ చేసిన పారిశ్రామికవేత్తలు

మెదక్‌: పటాన్‌చెరులోని ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం ముందు పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. అధికారులను బయటకు పంపి గేటుకు తాళం వేశారు. ట్రాన్స్‌కో ఏడీ, ఏఈలను నిర్బంథించి ధర్నాలో కూర్చోబెట్టారు. విద్యుత్‌ లేక పరిశ్రమలు మూతపడుతున్నాయని తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.