డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏప్రిల్ మొదటి వారంలోగా పూర్తి చేయాలి* -రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి.
గద్వాల నడిగడ్డ, మార్చి 24 (జనం సాక్షి);
అర్హులైన లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ఏప్రిల్ మొదటి వారం లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయిన కంటివేలుగు, ఆరోగ్య మహిళ, జి.ఓ 58, 59 , 76, 118 ప్రకారం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, ఇళ్ల పట్టాల కై సేకరించి ఉన్న ఖాళీ స్థలాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పోడు పట్టాలు, ఎండాకాలం వడగాల్పులు, అగ్ని ప్రమాదాల నివారణ సన్నద్ధత, ఐ.డి.ఓసి. ,పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల నిర్వహణ,తెలంగాణకు హరితహారం పై కలెక్టర్లు, ఆదనవు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిమాట్లాడుతూ
మున్సిపాలిటీల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు గుర్తించిన ఇళ్ళు కేటాయింపు చేసి ఆన్లైన్ లో వివరాలు అప్లోడ్ చేయాలని ఏప్రిల్ మొదటి వారం లోవు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కంటి వెలుగులో ప్రెస్క్రిప్షన్ అద్దాల పంపిణీ ఎప్పటికప్పుడు జరగాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ కంటివేలుగు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు ఒక లక్షా 30వేల 202 మందికి కంటి పరీక్షలు పూర్తి చేయడం జరుగిందన్నారు. 15,804 మందికి దగ్గరి చూపు అద్దాలు ఇవ్వడం జరిగిందని, దూరవు చూపు అద్దాలు 16,336 పంపిణీ చేయడం జరిగిందన్నారు. 98 వేల రెండు వందల ముప్పై రెండు మందికి ఎలాంటి కంటి సమస్యలు లేనట్లు గుర్తించడం జరిగిందన్నారు.జిల్లాలో పేదలకు ఉచితంగా ఇవ్వడానికి గతంలో సేకరించిన ఇళ్ల స్థలాలు ఆయా మండలాల్లో గుర్తించడం జరిగిందన్నారు. సేకరించిన స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి కేటాయింపులు జరుగనందున తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనల మేరకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ అనంతరం గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వడగాల్పులు, అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు విజవంతంగా కొనసాగుతున్నాయని, వచ్చే నెల 3 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.
హరితహారం లో నాటిన ప్రతి మొక్కను బతికించుకునే విధంగా వాచ్ అండ్ వార్డుల ద్వారా నీరు పోయించడం జరుగుతుందన్నారు. వచ్చే హరితహారానికి నర్సరీల్లో అవసరమైన మొక్కలు సిద్ధం చేసుకోవడం జరుగుతుందని తెలియజేసారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదనవు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ , డి ఆర్ డి ఏ ఉమాదేవి, డి ఇ ఓ సిరాజుద్దీన్, ఇంటర్మీడియట్ కో ఆర్డి నేతర్ హృదయ రాజు , గోవింద్ నాయక్ , ఫైర్ అధికారి , డాక్టర్ శశికళ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.