సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు పోటీ..

 

 

 

చెన్నారావుపేట, నవంబర్ 30(జనం సాక్షి):

నర్సంపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పై సర్పంచ్ అభ్యర్థులను పోటీగా పెడుతున్నా…

గ్రామాల్లోని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలి….

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

 

సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు మధ్య పోటీ జరిగే ఎన్నికలని నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామాలలో నుండి బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను పోటీగా పెడుతున్నానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం చెన్నారావుపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మండల బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంను నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు మధ్య పోటీ జరగనుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద మా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను పోటీకి దింపుతున్నానని గ్రామాలలోని ప్రజలు ఆశీర్వదించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండేళ్లలో గ్రామాలలో ఏమి అభివృద్ధి చేశారో చూపించాలన్నారు.
రెండేళ్లలో నర్సంపేట అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎందుకు సమీక్షించలేదని, నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రజలకు తెలియజేయాలన్నారు.
నేను నర్సంపేట శాసన సభ్యునిగా ఉన్నప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత ఊరుకు సొంత మండలానికి బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చెన్నారావుపేట మండలంలోని అన్ని గ్రామాలను, తండాలను, పల్లెలను బిఆర్ఎస్ అభివృద్ధి చేసిందని
సన్న ధాన్యం బోనస్ ఏమైందని సంపూర్ణ రుణమాఫీ ఏమైందని పెంచిన రైతు భరోసా ఏమైందని, మహిళలకు, వృద్ధులకు, యువతకు ఇచ్చిన హామీలు ఏమైనవో స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి 5 వతేదీన నర్సంపేటలో జరిగే సభలో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మహిళ సంఘాలకు, సొసైటీలకు చెందవలసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కమిషన్ల కోసం కాంటలు కొట్టి నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు యూరియా కోసం కష్టపడుతుంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్టించుకోలేదని రెండు సంవత్సరాలలో ఒక్క రూపాయి నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు.
ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను ప్రజల కోసమే ప్రతినిత్యం పనిచేస్తున్నానని మన నాయకులు ఈ సర్పంచ్ ఎన్నికలలో మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. అలాగే గ్రామాలలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా సర్పంచ్ అభ్యర్థులను ఎన్నుకొని కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాలలో గులాబీ జెండాలు ఎగురవేయాలని కోరారు.
ఈ సమావేశంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాల్నె వెంకన్న, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, మాజీ జడ్పిటిసి బానోతు పత్తి నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు కొండవీటి ప్రదీప్ కుమార్, అనుముల కుమారస్వామి, బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మంచోజు మనోజ్ కుమార్, బిఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భూక్య రవీందర్, మండల ఉపాధ్యక్షులు మదారపు శ్రీనివాస్, బోడ బద్ధు నాయక్, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీ, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అబ్దుల్ గఫార్, కుండె మల్లయ్య, జున్నుతుల మహేందర్ రెడ్డి, హంస విజయరామరాజు, ములుక సాంబయ్య కవి, కుసుమ నరేందర్, బుర్ర సుదర్శన్, గుర్రం రవి, చెరుకుపల్లి విజేందర్ రెడ్డి, బోడ ఆనంద్, సాదు నర్సింగరావు, సోషల్ మీడియా మండల ఇన్చార్జి బోడ మురళి నాయక్, భూక్య శ్రీనివాస్, బోడ సమ్ము నాయక్, బానోతు దేవ్ సింగ్, కడారి సాయిలు, ఊడుగుల సాంబయ్య, అందే వెంకట రాములు, పలు గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, గ్రామ పార్టీల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.