రంగంపేట బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

 

 

 

 

 

మెదక్ డిసెంబర్ 1 (జనం సాక్షి ):

కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు

తలారి దుర్గేష్, మాజీ ఎంపిటిసి రాజా గౌడ్రాజాగౌడ్

స్థానిక ఎన్నికల వేళ మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట బి ఆర్ ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బి ఆర్ ఎస్ పార్టీ మూడు ముక్కలైంది… మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి సమక్షంలో రంగంపేట గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తలారి దుర్గేష్, మాజీ ఎంపీటీసీ గోకని మాధవి భర్త రాజా గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే మాజీ ఉప సర్పంచ్ సార యాదయ్య, కోట శ్రావణ్, కొడకంచి జీవన్ గౌడ్, ఎంబరిశంకర్, గొకని అశోక్ గౌడ్, గోకని సాయగౌడ్, తలరి యేసు, మాజీ వార్డు సభ్యులు లింగపురం రాములు, చిలుక శేఖర్ గోకాని విరేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రంగంపేట తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండా కృష్ణ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొంగుల రవీందర్ గౌడ్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్ మండల సీనియర్ నాయకులు దేవ నగర్ శేఖర్ వెంకటేష్ గౌడ్ యాదగిరి రమేష్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.