డిఆర్‌ఓ, ట్రెజరీ కార్యాలయాలను

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్‌, ఆగస్టు 2 : కలెక్టరేట్‌లో ఉన్న డిఆర్‌ఓ, ట్రెజరీ ఎన్నికల విభాగాల కార్యాలయాలను గురువారం నాడు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్తూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ మొదట డిఆర్‌ఓ కార్యాలయాన్ని , డిఆర్‌ఓ జగదీశ్వరాచారీతో కలిసి సందర్శించారు. రాఖీ పండుగ కావడంతో ఉద్యోగులు తక్కువగా కనిపించారు. ఉద్యోగులు ఎక్కడా అని ప్రశ్నించగా, డిఆర్‌ఓ స్పందిస్తూ ఈ రోజు రాఖీ పండుగ ఉండడం వల్ల రాలేకపోయారని బదులిచ్చారు. దీంతో కలెక్టర్‌ డిఆర్‌ఓ కార్యాలయమంతా కలియ తిరిగి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎన్నికల విభాగాన్ని సందర్శించారు. ఎన్నికల విభాగంలో కలెక్టర్‌కి పాత గోడలు దర్శనమిచ్చాయి. అక్కడి నుంచి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం శిథిలావస్థలో ఉందని, చీకటిగా ఉందని ప్రశ్నించారు. ఈ కార్యాలయం చాలా పాతదని, పుననిర్మించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. డిటిఓ ఆవరణలో అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టగానే పరిపాలనపై దృష్టి సారించింది. దీంతో అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తుంది.