డిస్కం ప్రతిపాదనలే కానీ, ప్రభుత్వ ఆదేశాలు కావు: మంత్రి ఆనం

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై చెలరేగుతన్న వివాదానికి మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెరదించ్చే ప్రయత్నం చేశారు. డిస్కింలు ఇచ్చిన నివేదికే తుది నివేదిక కాదని ఆయన స్పష్టంచేశారు. అటు ఈఆర్‌సీ కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో డిస్కంలో ఇచ్చిన ప్రతిపాదనలు అమోదించిన దాఖలాలు చాలా తక్కువన్నారు. డిస్కింలు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వ ఆదేశాలని అనుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ఆర్‌సీకి నివేదిక ఇస్తుందో దానికే కట్టుబడి ఉంటుందన్నారు. ఇక మరో మంత్రి సి. రామచంద్రయ్య రాసిన లేఖపై స్పందిస్తూ లేఖలు రాసే స్వేచ్చ మంత్రులకు ఉంటుందని బదులిచ్చారు.