డీఎస్సీ 2012పై సమీక్ష : పార్థసారథి
హైదరాబాద్: డీఎస్సీ 2012 ఉద్యోగ నియామకాల పై సమీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు మంత్రి పార్ధసారథి తెలియజేశారు. జనవరి 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించిన అనంతరం ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తుతామన్నారు. డీఎస్సీ 2012లో తమకు అన్యాయం జరిగిందంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు మంత్రితో జరిగిన సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.