డీసీఎంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల మండలం మూసాపేట వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న డీసీఎం వ్యాన్‌ను శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళుతున్న డీసీఎం వ్యాన్‌ మూసాపేట వద్ద రోడ్డుపై ఆగి ఉండగా అదేవైపు వెళుతున్న అనంతపురం జిల్లా తాడిపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం ధ్వంసం కాగా అందులో ప్రయాణిస్తున్న మనోహర్‌గౌడ్‌, హరిప్రసాద్‌, మహ్మద్‌ సాబేర్‌లకు స్వల్పగాయాలయ్యాయి. డీసీఎం వ్యాను రోడ్డుకు అడ్డంగా పడటంతో గంటసేపు రాకపోకలు స్తంభించాయి.