డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 50 వాహనాల సీజ్‌

హైదరాబాద్‌: నగరంలో నిన్న రాత్రి నార్త్‌జోన్‌ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌  అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు, పంజాగుట్ట,ఫిలింనగర్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో మద్యం సేవించి నడుపుతున్న వాహనాలను సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన వాటిలో కార్లు, మోటారు సైకిళ్లు కలిపి సుమారు 50కి పైగా వాహనాలు ఉన్నాయి. ఏసీపీ మధు ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.