డ్రగ్స్ బెట్టింగ్ రహిత జిల్లాగా యువత తీర్చిదిద్దాలి.డ్రగ్స్ బెట్టింగ్ రహిత జిల్లాగా యువత తీర్చిదిద్దాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను యువత వమ్ము చేయరాదుభువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పిలుపు
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–నేటి ఆధునిక యుగంలో మానవుడు అనేక రంగాలలో పురోగతి సాధించుతున్న తరణన నేటి యువత నేటి యువత పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవడంతో వారి భవిష్యత్తును అధోగతి పాలు చేసిన వారు అవుతున్నారని భవనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆవేదన తెలియజేశారుశనివారం ఉదయం బెట్టింగ్ డ్రగ్స్ మద్యం అలవాట్లను యువత దూరంగా ఉండాలంటూ నిర్వహించిన యువ 5కే రన్ లో వివిధ రాజకీయ నాయకులతో పాటు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రపంచ దేశాల్లో మన యువత అన్ని రంగాలలో రాణిస్తుందని వివరించారు. ఈ తరుణాన తల్లిదండ్రుల ఆశలను సిద్ధించేందుకు కృషి చేయాల్సిన యువత క్రికెట్ బెట్టింగ్ ట్రాక్స్ మద్యం మత్తులో కూరుకపోవటంతో వారి భవిష్యత్తును వారే సర్ నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత వారి తల్లిదండ్రుల ఆశలను మమ్ము చేయకుండా వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పాశ్చాత్య సంస్కృతికి దూరంగా ఉండాలని ఆయన నేటి యువతతో కోరారు. వారు ఏకాగ్రత సాధించేందుకు యోగాను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. వారిలో మానసిక ఉల్లాసం కల్పించేందుకు విద్యాసంస్థలు కృషి చేయాలని తెలిపారు. ఆయా ప్రభుత్వాలు నిషేధించిన పోస్టులను వ్యాపారస్తులు విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పోలీస్, డ్రగ్స్ కంట్రోలర్, అధికారులు కన్నేసి ఉంచాలని అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆయన సంబంధిత అధికారులతో కోరారు. స్వచ్ఛంద సంస్థలు అని చెప్పుకుంటున్న వారు ప్రజలను చెడు వ్యసనాల నుండి దూరం ఉంచేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల్లో ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరిచేందుకు జూనియర్ కళాశాల మైదానంలో క్రీడా మైదానంగా త్వరలో తీర్చిదిద్దనున్నానని ఆయన హామీ ఇచ్చారు.యువ 5కె రన్ నిర్వహించేందుకు ఆర్థిక సాహాయం స్పాన్సర్ చేసిన దాతలకు ఈ సందర్భంగా అందరు కొనియాడారు.