ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌ ఘటనపై ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్‌ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌రేప్‌ ఘటనతో వెల్లువెత్తిన విద్యార్థుల ర్యాలీ సెగలు ఉస్మానియా యూనివర్సిటీని తాకాయి. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై  జరిగిన సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ ఓయూ విద్యార్థులు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆగ్రహంతో బయలుదేరిన విద్యార్థుల ర్యాలీని ఎన్‌సీసీ గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా  అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.