ఢిల్లీలో హెల్ప్‌లైన్ 181కు సాంకేతిక సమస్యలు
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ 181కు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన హెల్ప్‌లైన్ అవిష్కరణ కార్యాక్రమం సాయంత్రానికి వాయిదా వపడింది. దీంతో షీలాదీక్షిత్ మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఢిల్లీలో వైద్యవిద్యార్ధినిపై సామూహిక అత్యాచారంతో పాటు మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువవుతన్న నేపథ్యంలో వారికి రక్షణగా సత్వర సహాయం అందించేందుకు ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. సీఎం కార్యాలయం నుంచి పనిచేసే ఈ నెంబర్ 185 పోలీస్‌స్టేషన్లకు అనుసంధానం అయి ఉంటుంది.