ఢిల్లీ అత్యాచార ఘటనపై ఈ – ఛార్జిషీట్‌ దాఖలు

న్యూఢిల్లీ : ఢిల్లీ అత్యాచార ఘటనపై పోలీసులు ఈ-ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఘటనకు సంబంధించి పోలిసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌తో సహా అన్ని పత్రాలు తాను స్వీకరించినట్లు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ నమిత్రా అగర్వాల్‌ తెలియజేశారు. ఘటనకు బాధ్యులైన అయిదుగురు నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆమె పోలీసులను ఆదేశించారు.