ఢిల్లీ పెద్దలపై న్యాయస్థానంలో మరో పిటిషన్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేశారని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా 11వ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కేంద్ర మంత్రులు షిండే, చిదంబరం, ఆజాద్‌లపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి ఫిబ్రవరి 28లోగా నివేదిక ఇవ్వాలని చైతన్యపురి పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.