ఢిల్లీ బాటపట్టిన కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ : జైపూర్‌ మేధోమథనం ముగియడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా హస్తిన బాట పట్టారు. ఈ నెల 28లోపు తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు అధిష్ఠాన పెద్దలను కలిసి తమ వాణి వనిపించేందుకు సిద్ధమయ్యారు. జైపూర్‌ వెళ్లిన మంత్రులు, నేతలు అక్కణ్నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లగా మిగతా నేతలు నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. మరికొందరు నేతలు ఈ ఉదయం దేశరాజధానికి బయలుదేరివెళ్లనున్నారు.