ఢిల్లీ సంఘటనను ఖండిస్తూ మహిళా సంఘాల ర్యాలీ
హైదరాబాద్: ఢిల్లీలో పారామెడికల్ విద్యార్దినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ హైదరాబాద్ మోహిదీపట్నంలో మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ఈసంఘటనపై ఉద్యమించిన యువతపై దాడిని ఆ సంఘాల నేతలు ఖండించారు. అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. యువతను పెడదారి పట్టిస్తున్న సినిమాలు, ప్రసార సాధనాల్లో అశ్లీలతను వెంటనే నిరోధించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠానంగా శిక్షంచాలన్నారు. ఢిల్లీ విద్యార్థులపై దాడులకు దిగిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.