తగ్గుముఖం పట్టిన వెండి ధరలు
భారీగా పెరిగిన వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పడిపోవడంతోపాటు దేశీయంగా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో వెండి ధర రూ.46 వేల దిగువకు చేరుకుంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఒకేరోజు రూ.1,020 తగ్గి రూ. 45,745కి పడిపోయింది. వెండి ధరలు భారీగా పతనమైనప్పటికీ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు నమోదుకాలేదు. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిక్షిగాముల ధర రూ.30,650గా ఉంది.