తాండూరు కాంగ్రెస్ కంచుకోటలో నూతన ఉత్సాహం.
డాక్టర్ సంపత్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి
రావడంతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం..?
సంపత్ కుమార్ శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో యువత కాంగ్రెస్ లో చేరికలు.
తాండూరు సెప్టెంబర్ 28(జనంసాక్షి) పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ మరియు పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రెడ్డి రాకతో తాండూర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో నూతన ఉత్సాహం నెలకొంది.గత వారం రోజుల క్రితం తాండూర్ పట్టణ బివిజి ఫౌండేషన్ వ్యవస్థా పకులు డాక్టర్ సంపత్ కుమార్, పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ కొనసాగుతుంది.వీరిద్దరి రాకతో కాంగ్రెస్ పార్టీ తాండూర్ గడ్డపై విజయం సాధిస్తారని పుకార్లు షికార్లు కొనసాగుతున్నాయి. సంపత్ కుమార్ మరియు శ్రీనివాస్ రెడ్డిల మధ్య ఎవరికో ఒక్కరికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కన్ఫామ్ అవుతుందని సమాచారం.ఇప్పటికే తాండూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఎల్ఆర్ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తూన్నారని సమాచారం. తాండూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కేఎల్ఆర్ మరియు రమేష్ మహారాజ్, డాక్టర్ సంపత్ కుమార్ ,శ్రీనివాస్ రెడ్డిలు ప్రచారం నిర్వహిస్తూ ఎవరు దీమలో వారు ఉన్నట్లు కార్యకర్తలు నాయకులు చెప్పుకుంటున్నారు. రమేష్ మహారాజ్ వర్గం కె ఎల్ ఆర్ కు మద్దతు ఉందని అదే విధంగా నేటి యువత మావైపే ఉన్నారని సంపత్ మరియు శ్రీనివాస్ రెడ్డి దీమలో ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం ఈసారి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తాండూర్ లో విజయం సాధించాలని అనేక సర్వేలు నిర్వహించి గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పబోతున్నారు.గత 15 రోజుల క్రితం తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయభేరిలో 6 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్ట డం జరిగిందని సంక్షేమ పథకాలకు ప్రజలు ఇప్పటినుండి ఆకర్షితులవుతున్నారని ఈసారి ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించాలని లక్ష్యంతోముందడుగులు వేస్తున్నారు. మరోవైపు డాక్టర్ సంపత్ కుమార్ మరియు పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో యువత భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.అయితే తాండూరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఎవరూ…అనేది తెలాలి.అప్పుడే గెలిచేది ఎవరు అనేదానిపై స్పష్టతలబిస్తుందని ఈ విషయం పై నియోజకవర్గ ప్రజలలో చర్చకో నసాగు తుంది.మరో వారం రోజులు వేచిచూద్దాం.. మరీ.