తాడ్‌బస్‌లోని స్పాంజి పరిశ్రమలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: పాతబస్తీ తాడ్‌బస్‌లోని స్పాంజి పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి భారీఎత్తున ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.