తిమ్మప్ప స్వామి దేవాలయంలో అన్నదానం
మల్దకల్ సెప్టెంబర్ 3 (జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు తాటికుంట గ్రామానికి చెందిన తిమ్మయ్య శెట్టి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, అర్చకులుమధుసూదనాచారి, రమేష్, రవి, దీరేంద్ర దాస్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీతారామ్ రెడ్డి మధుసూదన్ రెడ్డి, సవారన్న, చంద్రశేఖరరావు, బ్యాంక్ నాగరాజు, బాదామి శ్రీనివాసులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.