తిరువనంతపురం నుంచి చెన్నైకు వెళ్లే రైలులో 13 కిలోల బంగారం చోరి

కోయంబత్తూరు: తిరువనంతపురం నుంచి చెన్నైకు వస్తున్న రైలులో 13 కిలోల బంగారం చోరీ అయింది. చెన్నై షహుకారుపేట ఎన్నెస్సీ బోన్‌ రోడ్డుకు చెందిన వినోద్‌కుమార్‌ జైన్‌ స్థానికంగా నగల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద పని చేస్తున్న వరదరామ్‌(45), మదన్‌సింగ్‌, జితేంద్రసింగ్‌ కొత్త నగలను తయారు చేసి కోవై, ఈరోడ్‌ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో వీరు ముగ్గురు ఈ నెల 21 వ తేదీన 13 కిలోల ఆభరణాలను ఈసుకుని కోవై వెళ్లారు. అక్కడి దుకాణాదారులు కొనేందుకు విముఖత చూపటంతో ఆదివారం రాత్రి తిరుగు పయనమయ్యారు. చెన్నైకు వస్తున్న రైలులోని ఎన్‌-6 బోగీ ఎక్కారు. నగల బ్యాగులను బెర్తుల కింద పెట్టి గొలుసుతో కట్టేసి నిద్రపోయారు. వేకువజామున 3.30 గంటలకు నిద్ర లేచిన వరదరామ్‌ బ్యాగులు లేకపోవటం గమనించి మిగావారికి తెలిపారు. అనంతరం ఈరోడ్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజావార్తలు