తుపాను నష్టం అంచనాకు ప్రత్యేక బృందం: ప్రధానికి సీఎం లేక

హైదరాబాద్‌:రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నీలం ప్రభావంపై సీఎం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న 11 మంది మంత్రులతో పాటు వివిధశాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గోన్నారు. నీలం తుపాను నష్టం అంచనాకు రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపి ఆర్ధిక సాయం చేయాలని ప్రధానికి, అలాగే తడిచిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కేంద్ర చేనేత మంత్రికి లేఖ రాయాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.